ELR: విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఓ ఫౌండేషన్, పోలీస్ శాఖ సంయుక్తంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు అమీనా పేటలోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్య చంద్రరావు చేతుల మీదుగా ఉచిత కళ్ళజోడులు పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని అన్నారు.