»Tragedy In Tollywood Young Actor Died Of Heart Attack
Harikanth: టాలీవుడ్లో విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు హరికాంత్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన 'కీడా కోలా' మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.
‘పెళ్లిచూపులు’ , ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘కీడా కోలా’. రెండు రోజుల క్రితమే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇందులో కీలక పాత్రలో నటించిన హరికాంత్ (33) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు వంశీ కాకా ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. యువనటుడు హరికాంత్ మృతిపట్ల చిత్ర యూనిట్‌తో పాటుగా పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
A hardworking theater artist turned actor (Keeda Cola & other films) 33-year old Harikanth passed away today in the early hours due to cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/6FbP9sjwwE
హరికాంత్ థియేటర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చకుంటున్న నేపథ్యంలో ఈ దారుణం జరిగింది. గతంలో ఆయన పలు సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేశాడు. ప్రస్తుతం ‘కీడా కోలా’లో ఓ కీలక పాత్రలో హరికాంత్ కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్లోనూ హరికాంత్ షాట్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రైం కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న కీడా కోలా మూవీ త్వరలోనే విడుదల కానుంది.