SKLM: జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026ను ఈ నెల 27, 28, 29వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు స్థానిక కోడి రామమూర్తి స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడా పోటీలు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని తెలిపారు.