ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి పుష్ప2 చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పెరిగిన అంచనాలను అందుకునేందుకు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బన్నీ, సుకుమార్. ఇటీవలె ఓ ఐదు రోజులు షూటింగ్ కూడా చేశారు. వచ్చే ఏడాది ఎండింగ్ లేదా.. 2024లో పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయమంటున్నారు. అందుకే బన్నీ మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవడం లేదనే టాక్ ఉంది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి పని చేయబోతున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు రేసుగుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో మరోసారి ఆ కాంబో రిపీట్ అవనుందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఇప్పటికే సురేందర్ రెడ్డి బన్నీకి ఓ కథ చెప్పడం.. దానికి ఆయన ఓకే చెప్పించడం కూడా జరిగిపోయిందట. ఈ స్టైలిష్ డైరెక్టర్ ప్రస్తుతం అఖిల్‌తో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ పై సురేందర్ రెడ్డి దృష్టి సారించనున్నాడని టాక్. వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సూరికి ఓ కమిట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు బన్నీ కోసం.. రేసుగుర్రం వంటి మంచి కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడట. అన్ని కుదిరితే.. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.