NZB: సరదాగా హోలీ చేసుకున్న ఆ యువకుల ఆనందం మంజీరా నదిలో ఆవిరైపోయింది. బోధన్‌లో ఆచన్‌పల్లి కాలనీకి చెందిన రోని చౌదరి(18), సాయికుమార్(20) తమ స్నేహితులతో కలిసి స్నానానికి సాలూర వద్ద నదిలోకి దిగారు. లోతైన ప్రాంతానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు వచ్చేలోపే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.