MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో గురువారంHPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.