KNR: జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి(DCSO) ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండరు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని అన్నారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిత్తే చర్యలు తప్పవన్నారు.