సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'వార్2(War 2)'. ఈ క్రమంలో నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ కోసం శ్రమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన విషయం తెలిసిందే. వార్ 2గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘వార్ 2(war2)’లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీతోనే యంగ్ టైగర్..బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా, దానికి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీన్స్ ని ఈ మూవీలో చూసే అవకాశం ఉంది. కాగా తాజాగా ఈ మూవీకి హీరోయిన్ ని కన్ఫామ్ చేశారట. బయటకు వచ్చిన సమాచారం మేరకు ఈ మూవీలో కియారా అద్వాణిని హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. మరి కియారా ఎన్టీఆర్ సరసన చేస్తుందా లేక, హృతిక్ సరసన చేస్తుందా అనేది మాత్రం తెలియలేదు. ఒక హీరోయిన్ గా మాత్రం కియారాని ఎంచుకున్నారని బయటకు వచ్చింది.
ఇక ఎన్టీఆర్ పాత్ర హృతిక్ రోషన్(Hrithik roshan)తో సమానంగా పాత్ర సాగుతుందని, అయితే నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం తారక్(jrntr) హోం వర్క్ కూడా స్టార్ట్ చేశాడట. మూవీ ప్రారంభించడానికి ముందే తన పాత్రలో లీనమయ్యేందుకు ఆయన అయాన్ తో కలిసి రీడింగ్ సెషన్స్ లో పాల్గొంటున్నారట. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, వార్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో వాణి కపూర్, అశుతోష్ రానా కూడా కీలక పాత్రల్లో నటించారు. హృతిక్ సైతం ఫైటర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తారక్ కొరటాల శివ మూవీలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాత వార్ 2 షూటింగ్ ప్రారంభమౌతుంది.