TPT: మార్చి 17న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. దీంతో పర్యటనను విజయవంతం చేయడం కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు.