మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ బోగస్ రశీదులతో మోసం చేసినందుకు ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల క్రింద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసారు. షాద్‌నగర్ సమీపంలో సువర్ణ కుటీర్ పేరుతో వెంచర్ వేసి ఫ్లాట్ల విక్రయాలు జరిపారు. ఈ క్రమంలో కృష్ణానగర్‌కు చెందిన కొండల్రావు అనే వ్యక్తితో పాటు సినీ పరిశ్రమలో పనిచేసే 21 మంది రూ.6 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు చెల్లించి ఫ్లాట్లను కొనుగోలు చేశారు.
ఆ తర్వాత సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, జీఎం ప్రవీణ కుమార్, సమక్షంలో తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాల్లో డబ్బులు(money) చెల్లించారు. 2022లో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పినా అలా చేయలేదు. బాధితులు ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ జాప్యం చేయసాగారు. ఆ తర్వాత సంస్థ వద్దకు వెళ్లి అడుగగా చెల్లించిన మొత్తంలో ఇరవై శాతం మాత్రమే సంస్థకి చేరిందని మిగతాది రాలేదని చెప్పగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు.
అయితే ఇప్పుడు ఈ వ్యవహారమంతా గ్లోబల్ స్టార్ చరణ్ ఇమేజ్ డ్యామేజ్ చేలా ఉండటం విశేషం. ఈ సువర్ణ భూమికి రామ్ చరణ్(ram charan) ఎప్పటి నుంచో బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. ఈ కేసుల వ్యవహారంతో చరణ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఈ కేసుల తర్వాత చరణ్ దీనికి ఇంకా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారో లేదో చూడాలి మరి.