ELR: నూజివీడు(మం) మీర్జాపురంలో ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. లీగల్ సెల్ సభ్యులు జొన్నలగడ్డ శివశంకర్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇతర మతాలు ఏవైనా మనమంతా ఒక్కటే అనే సాంప్రదాయం భారతదేశంలో కొనసాగుతోందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు.