విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.48 లక్షలతో క్రిస్టియన్ స్మశానవాటికలో నిర్మించిన వెయిటింగ్ రూమ్, రూ.41 లక్షలతో జేఎన్యూఆర్ఎం కాలనీలో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. వార్డు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజల అవసరాలే లక్ష్యంగా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.