Chiranjeevi: బింబిసార డైరెక్టర్ తో చిరు..స్టోరీ వింటే ఫ్యాన్స్ కి పూనకాలే..!
కళ్యాణ్ రామ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ బింబిసారతో సృష్టించిన సంచలనం తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి- వశిష్ఠ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మంచి స్పీడ్ మీద ఉన్నారు. వాల్తేరు వీరయ్య హిట్ తో ఆయన మరింత స్పీడ్ పెంచారు. వరస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం చిరు బోళా శంకర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఆయన వరస పెట్టి సినిమాలు చేయనున్నారు. దానిలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా ఉంది. మరో మూవీకి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. కాగా, బింబిసార మూవీతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట(Vasishtha)తో చిరు సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందట. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.
మూవీ ప్రారంభించడానికి ముందే ఆ హీరోయిన్ల వేటలో దర్శక నిర్మాతలు పడటం విశేషం. ఏ పాత్రకు ఎవరైతే బాగుంటారా అని వెతుకుతున్నారట. అయితే, ఎనిమిది మందీ స్టార్ హీరోయిన్లు కాదు. కొందరు స్టార్ హీరోయిన్లు ఉంటే, మరి కొందరు కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందట. ఇన్సైడ్ టాక్ ప్రకారం బింబిసార తర్వాత, అతను రామ్ చరణ్‌కి ఒక లైన్ చెప్పాడు. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా, అతను చిరంజీవికి కథను వివరించాడు. ఇప్పుడు ఈ చిత్రానికి ముల్లోక వీరుడు అనే టైటిల్‌ను ఆసక్తికరంగా పెడుతున్నట్లు సమాచారం. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోస్టర్ డిజైన్, ఇతర పనులు పూర్తవుతాయి. ఇక కళ్యాణ్ కృష్ణతో సినిమా, మరో వైపు వశిష్టతో సినిమా రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించాలని చిరు అనుకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభమౌతాయో చూడాలి. ఇదిలా ఉండగా, చిరు బోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయన సరసన తమన్నా, చెల్లిలిగా కీర్తి సురేష్ నటించారు. ఆగస్టులో విడులకు ప్లాన్ చేస్తున్నారు.