AKP: పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 14 ఏళ్లు పూర్తయిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు HPV వ్యాక్సిన్ వేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 226 మంది వ్యాక్సిన్ వేయడానికి అర్హులుగా గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ పాల్గొన్నారు.