NRML: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ అదనపు కలెక్టర్ నాగేశ్వరవాడలో పర్యటించారు. మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రజలకు పరిశుభ్రత, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.