»Uber Rapido Service Ban In Delhi Supreme Court Stay
Uber Rapido: ఉబర్, ర్యాపిడోలకు షాక్!
ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించే వరకు దేశ రాజధానిలో ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు(supremecourt) వెల్లడించింది.
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని రాపిడో, ఉబర్ బైక్-టాక్సీ సేవలు ప్రస్తుతానికి నిలిపివేయబడ్డాయి. ఇవి నిర్వహిస్తున్న సేవలపై ఢిల్లీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు బైక్ ట్యాక్సీలను నడుపుకోవచ్చని మే 26న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. జులై చివరిలోపు నూతన విధానం తీసుకొస్తామని ఢీల్లీ ఆప్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ర్యాపిడో, ఉబర్ ట్యాక్సీలు మెటారు వాహనాల చట్ల 1099ను ఉల్లంగిస్తున్నాయని చెబుతూ గత ఫిబ్రవరిలో బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించారు.
ఢిల్లీ ప్రభుత్వం తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లు రాపిడో, ఉబర్లు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహించేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు(supreme court) సోమవారం విచారించిన క్రమంలో తెలిపింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేష్ బిందాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జారీ చేసిన పబ్లిక్ నోటీసులో ఢిల్లీలో బైక్-టాక్సీలు తిరగకుండా ప్రభుత్వం హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడితే రూ. లక్ష వరకు జరిమానా విధించబడతారని హెచ్చరించింది.