KMR: సదాశివనగర్ మండల కేంద్రంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. స్వయంగా ట్యాంకు పైకి వెళ్లి లోపల పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాంకును తప్పనిసరిగా శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరారు.