KDP: YS వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని CBI స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు CBI వెల్లడించింది. దీంతో సునీతా రెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, వివేకా హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టిన విషయం తెలిసిందే.