»Chicken Rate Increase In Telugu States Kg Chicken Rs 340
Chicken rate: కొండెక్కిన కోడి ధర..కిలో ఎంతో తెలుసా?
చికెన్‌ను తినేందుకు అనేక మంది ఇష్టపడతారు. ఇది మంచి రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ లతో నిండి ఉంటుంది. అయితే భాగ్యనగరంలో గతంలో రూ.200 ఉన్న చికెన్ రేటు(chicken rate) ప్రస్తుతం 300 రూపాయలు దాటేసింది.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(chicken rates) భారీగా పెరిగాయి. ఎండల కారణంగా కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలు..నిన్న(జూన్ 11న) ఆదివారం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిల్లర చికెన్ కిలో రూ.320 నుంచి రూ.340 పలుకుతోంది. రూరల్ ఏరియాలతో పాటు హైదరాబాద్ లో చాలా చోట్ల స్కిన్ లెస్ ఇదే రేటు తీసుకున్నారు. రూ.340 ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వ్యాపారులు, వినియోగదారులు చెబుతున్నారు. ఆదివారం చికెన్ షాపులకు వెళ్లిన పలువురు రేట్లు చూసి అవాక్కయ్యారు. కిలో కొనుగోలుదారులు అర కిలోకే పరిమితమయ్యారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జూలై మొదటి వారం నుంచి ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు హోల్ సేల్ చికెన్ ధర కిలో రూ.146 ఉండగా, చికెన్ ధర రూ.260 నుంచి 270 పలుకగా.. 4వ తేదీ నుంచి క్రమంగా రేట్లు పెరిగాయి. 8వ తేదీ చికెన్ హోల్ సేల్ ధర పెరిగింది. కిలో రూ.167 నుంచి చికెన్ ధర రూ.300కి పెరిగింది. ఆదివారం హోల్ సేల్ ధర రూ.173కి చేరడంతో అన్ని చోట్లా రిటైల్ మార్కెట్ లో చికెన్ కిలో రూ.320 నుంచి రూ.340 వరకు విక్రయించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దాదాపు ఇవే రేట్లు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రూ.340 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్(hyderabad)లో చాలా చోట్ల ఇదే రేటు నమోదైంది. ప్రతి సంవత్సరం వేసవిలో తీవ్రమైన ఎండలకు కోళ్లు చనిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు(companies) ఉత్పత్తిని తగ్గించడంతో రేట్లు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.
కంపెనీలు మే చివరి వారంలో రైతులకు కోళ్లను ఇచ్చి జూన్‌లో ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో డిమాండ్(demand) కంటే ఉత్పత్తి తక్కువగా ఉంది. అయితే ఈసారి మే నెలలో అకాల వర్షాలు కురిశాయి. వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో జూన్ మొదటి వారంలో 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి ముందుకు రావడం లేదు. కోళ్ల కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగాయి. జూలై మొదటి వారం నుంచి రేట్లు తగ్గుతాయని అంటున్నారు.