PDPL: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ, డెంటల్ సేవలు, గర్భిణీల హెల్త్ చెకప్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ పూర్తి స్థితిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. ఎన్.సి.డి విభాగంలో ఏవైనా మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.