VSP: ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 15న వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలోని క్రాంతి థియేటర్లో ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఫెడరేషన్ నేతలు తెలిపారు. పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుండగా, మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు.