కుంభమేళాలో పూసలమ్ముతూ వైరలైన మోనాలిసా, ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే, తాజాగా ఆమె కేరళలోని తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడితో ఆమె గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉంది. వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు నిరాకరించడంతో.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేసింది.