MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రామరాజు రఘునాథ్ రావు బుధవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇవాళ పరిస్థితి మరింత క్షీణించి తనువు చాలించారు. రఘునాథ్ రావు మృతి పట్ల పలువురు మండల నాయకులు సంతాపం తెలిపారు.