KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 18 వాహనాల్లో 82 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,490, కనిష్ఠంగా రూ.7,000 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత కార్యదర్శి రాజా పరిశీలించారు.