SRD: సదాశివపేట నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం మీదుగా కొండగట్టు అంజన్న సన్నిధి వరకు పాదయాత్ర చేస్తున్న హనుమాన్ భక్తులకు బుధవారం శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, హిందూ పరిరక్షణ సమితి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ యాదవ్, నాయకులు పూడూరి సుధాకర్, ఏర్పుల అశోక్, తదితరులు ఉన్నారు.