MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం బీ.ఎడ్ మొదటి సెమిస్టర్, ఫామ్-డి (1 నుంచి 5 ఏళ్లు) ఫలితాలను వీసీ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. బీ.ఎడ్ ఫలితాల్లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి ప్రావీణ్య పాల్గొని వివరాలు వెల్లడించారు.