AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు వెల్లడించనున్న ఉత్తర్వుల్లో వారెంట్ రద్దు అవుతుందా లేదా అన్నది తేలనుంది.