BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో వెళ్లే వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. రహదారి భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.