KMR: కన్నతండ్రే ముగ్గురు పసికందులను చెరువులో పడేసి ప్రాణాలు తీసిన అమానుష ఘటనపై సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు బాధిత తల్లిని పరామర్శించిన ఆయన చిన్నారుల మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బాధితురాలికి ఆర్థిక సాయం అందజేసి, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఆమె జీవనోపాధి కోసం ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామన్నారు