KNR: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలనూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సచివాలయంలో శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 క్యాబినేట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.