HYD: మియాపూర్ మెట్రో డిపో సమీపంలోని ఎస్ఎస్ ట్రాన్స్కో సబ్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న కూకట్పల్లి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా మెట్రో డిపోకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, అక్కడ జరగాల్సిన పలు పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.