MBNR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పాలమూరు వాసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల నుంచి మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.