ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.