ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన వనితా విజయ్‌కుమార్ (Vanitha Vijaykumar) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఏ అమ్మాయికైనా తండ్రినే హీరో. అలాంటిది మా ఫాదర్ మాత్రం నా పాలిట విలన్ అని చెప్పలేనుగానీ, ఆయన నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. మా ఫాదర్ కి, నాకు ఆస్తి తాలూకు గొడవలు ఉన్నాయి. ఆ విషయంలో ఆయన నన్ను పోలీసులతో ఇంట్లో నుంచి బయటికి గెంటించారు” అని అన్నారు. ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్లాలనేది నాకు అర్థం కాలేదు .. నడిరోడ్డుపై నిలబడిపోయాను. అప్పుడు ఉన్న ప్రభుత్వం వలన ఆ పని చేయగలిగారు .. కానీ ఇప్పుడు వాళ్లు అలా చేయలేరు. ఆ పరిస్థితుల్లో నేను పిల్లలతో మైసూర్ (Mysore) వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉన్నాను. ‘నువ్వు ఇకపై ఎప్పటికీ తమిళనాడు(Tamil Nadu)లో అడుగుపెట్టలేవు’ అని మా ఫాదర్ నాతో అన్నారు. అలాంటి తమిళనాడులో నేను ఈ రోజున దర్జాగా బ్రతుకుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే వనిత పెళ్లి చేసుకొని విడిపోయిన నాలుగో భర్త మరణించిన విషయం తెలిసిందే.. అయన మృతి పై వనిత ఎమోషనల్ (Emotional) అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వనిత మాట్లాడుతూ.. తనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన ఫ్యామిలీ తనకు చేసిన అన్యాయం గురించి తెలిపింది వనిత విజయకుమార్. మళ్లీ పెళ్లి’ (Malli pelli) సినిమాలో ఆమెకి అవకాశం ఇచ్చారు. అలా చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ జరిగింది.