NLR: ఈ నెల13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నగదు జమ చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి మంగళవారం తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. రైతు విశిష్ట సంఖ్య నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.