VKB: మర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో పబ్లిక్ మూత్రశాలలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ బస్సుల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో కనీస మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు.