Srikanth Addala: ‘అఖండ’ మేకర్స్‌తో ‘శ్రీకాంత్ అడ్డాల’.. హీరో ఎవరంటే?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. కానీ గత కొన్నాళ్లుగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా అఖండ మేకర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ హీరో ఎవరు?
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ప్రేమ కథల్లో మరో కొత్త లోకాన్ని పరిచయం చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఈ రెండు సినిమాలతో శ్రీకాంత్ టాలీవుడ్ టాప్ చైర్లో కూర్చుంటారని ఫిక్స్ అయిపోయారు అంతా. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు శ్రీకాంత్. ముఖ్యంగా మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చిన కూడా.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల మళ్లీ కోలుకోలేదు.
అయితే కరోనా సమయంలో వెంకటేష్‌తో కలిసి తమిళ్ ‘అసురన్’ మూవీని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా ఓటిటికే పరిమితమైంది. ఇక ఇప్పుడు నారప్ప తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. నందమూరి బాలకృష్ణ తో అఖండ సినిమాను నిర్మించిన ద్వారక క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు? ఎలాంటి సినిమా? టైటిల్ ఏంటి? అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. జూన్ 2వ తేదీన ఉదయం 11 గంటల 39 నిమిషాలకు టైటిల్ అండ్ నటీనటుల వివరాలు తెలియనున్నాయయని ప్రకటించారు.
అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రం.. శ్రీకాంత్ అడ్డాల నుంచి ఊహించని మాస్ సినిమా రాబోతున్నట్టు చెబుతోంది. అయితే ఈ సినిమా హీరో ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. చాలా రోజులుగా మిర్యాల రవిందర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కొత్త హీరోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దాంతో అతను ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.