TG: పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలు శాంతిని పాటించాలని ఇప్పటికే భారత్ స్పష్టం చేసిందన్నారు. అమెరికాకు సరెండర్ అవుతోందని కాంగ్రెస్సే.. మోదీ కాదని పేర్కొన్నారు. దేశంలో ఇంధన నిల్వలు 70 రోజులకు సరిపడా ఉన్నాయన్నారు. గ్యాస్ కొరత మాత్రం కొంత ఉండొచ్చన్నారు.