ఖమ్మం: జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో జిల్లా రుణ ప్రగతిని సమీక్షించారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాల రుణాల పంపిణీ లక్ష్యంలో 78.53 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. ముఖ్యంగా రూ. 97 కోట్ల విద్యారుణాల లక్ష్యానికి గాను కేవలం రూ. 22.56 కోట్లు మాత్రమే పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.