VSP: అగనంపూడి జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు బలిరెడ్డి కిషోర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన మైలురాయిను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.