ASR: డుంబ్రిగూడ మండలం అరకు పంచాయితీ కొండవీధిలో అంగన్వాడీ కేంద్ర భవనం రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది. భవనం పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సొంత భవనం లేక అద్దె భవనంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కారణంగా భవనం అలాగే నిలిచిపోయింది.