వికారాబాద్ జిల్లాలో 9 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ఆడపిల్లలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ(HPV) వ్యాక్సిన్ను వేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలు 10,610 మంది ఉన్నట్లు ఆమె వెల్లడించారు. పరిగి, తాండూర్, కొడంగల్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు.