SRPT: విద్యార్థులు సామాజిక రుగ్మతలకు దూరంగా ఉంటూ లక్ష్యాలను చేరుకోవాలని ఎస్సై నరేష్ సూచించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, డ్రగ్స్, షీ టీమ్స్‌పై అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించారు. అపరిచితులకు OTPలు చెప్పవద్దని, వేధింపులు ఎదురైతే 100 లేదా 1930 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. పలు సూచనలు చేశారు.