TPT: తిరుపతి నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 40 వినతులు అందినట్లు కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఇందులో 28 మంది నేరుగా, 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.