»2 5 Cr Worth Gold And Diamond Ornaments Loops In Rain Water At Bengaluru
Rainsకు కొట్టుకుపోయిన బంగారం, వజ్రాభరణాలు.. కోట్ల రూపాయల నష్టం
ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దుకాణం మూసేయడానికి కూడా అవకాశం లభించలేదు. వరద దుకాణంలోకి పోటెత్తడంతో బంగారు, వజ్రాభరణాలు, డబ్బు నీటిలో కలిసిపోయాయి. నగలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి.
ప్రభుత్వాలు మారుతున్నా సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన బెంగళూరులో (Bengaluru) పరిస్థితులు మాత్రం మారడం లేదు. గంటల కొలదీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam)కు తోడు వర్షాలు బెంగళూరును అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం (Rain) వస్తే బెంగళూరువాసులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి ఆ నగరం వణికిపోయింది. వర్షానికి కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. ఒక తెలుగు యువతి మృతిచెందిన సంఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వర్షానికి చాలా నష్టాలు సంభవించాయి. ఒక నగల దుకాణంలోని (Jewellery) రూ.రెండున్నర కోట్ల విలువైన బంగారు (Gold), వజ్ర ఆభరణాలు (Diamond Ornaments) నీటి పాలయ్యాయి. దుకాణంలోకి వరద దూసుకురావడంతో ఆభరణాలు నీటిలో (Water) కొట్టుకుపోయాయి. దీంతో దుకాణం యజమాని లబోదిబోమంటున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని మల్లేశ్వర్ (Malleswaram) ప్రాంతంలో నిహాన్ జ్యూవెలరీ (Nihan Jewellery) ఉంది. మే 21న భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దుకాణం మూసేయడానికి కూడా అవకాశం లభించలేదు. వరద దుకాణంలోకి పోటెత్తడంతో బంగారు, వజ్రాభరణాలు, డబ్బు నీటిలో కలిసిపోయాయి. నగలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఇక దుకాణం మొత్తం విధ్వంసానికి గురయ్యింది. ఫర్నీచర్ దెబ్బతింది. దుకాణంలోని దాదాపు 80 శాతం నష్టపోయారు. వరద తగ్గుముఖం పట్టిన అనంతరం ఆభరణాల కోసం కాలువలు, రోడ్ల వెంట దుకాణం సిబ్బంది గాలించారు. అయినా కూడా ఆభరణాలు (Ornaments) కనిపించలేదు. వరదలో కొట్టుకుపోయిన ఆభరణాల విలువ దాదాపు రూ.రెండున్నర కోట్లకు పైగా ఉందని నిహాన్ జ్యువెలరీ యజమాని ప్రియ వాపోయారు.
ప్రభుత్వ తప్పిదంతోనే తమకు భారీ నష్టం జరిగిందని ఆమె తెలిపారు. వరద రావడంపై మున్సిపల్ (Municipal) అధికారులకు సమాచారం అందించగా.. వారు స్పందించలేదని ఆరోపించారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. కాగా, ఒక్కసారిగా వరద పోటెత్తడానికి కారణం అక్కడ జరుగుతున్న పనులేనని తెలిసింది.