AP: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకం బ్యాన్ చేయాలని భావిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. 90 రోజుల్లోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే, 13-16 మధ్య వయసున్న వాళ్లపైనా ఆలోచన చేస్తున్నామని.. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.