MDK: మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో మహిళలు అనేక విజయాలు సాధిస్తున్నారని ఛైర్ పర్సన్ రాధిక అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా సాధికారత లేకుండా ఏది సాధ్యం కాదన్నారు. ముఖ్యంగా మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు, క్రీడలు, వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. అనంరతం మహిళా ప్రజా ప్రతినిధులను సన్మానించారు.