కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. ఈటీ సినిమాతో మెప్పించలేకపోయాడు. కానీ విక్రమ్ సినిమాలో రోలెక్స్‌గా దుమ్ముదులిపాడు. ప్రస్తుతం సూర్య ఫ్యాన్స్.. ఆయనను రోలెక్స్ అని పిలుస్తున్నారు. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది కూడా బాలా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో బాలా దర్శకత్వంలో సూర్య నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు.. నటన పరంగా సూర్యను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయి. తెలుగులో వచ్చిన ‘శివపుత్రుడు’ సినిమా ఎంత సంచలనంగా నిలిచిందో తెలిసిందే. అందుకే మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఊహించని విధంగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ‘వనంగాన్’ తెలుగులో ‘అచలుడు’ అనే టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే కన్యాకుమారిలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అయితే ఆ తర్వాత సూర్య, బాలా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టు.. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం కష్టమనే వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు బాలా అధికారికంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రకటించాడు. అయితే సూర్య ప్లేస్‌లో మరో హీరోతో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో సూర్య-బాలా మధ్య అసలేం జరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై కోలీవుడ్ వర్గాలు ఏమంటోయో చూడాలి.