MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ శివారులోని గుండ్లకుంట ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా రైస్ మిల్లు నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కుమ్మరి నర్సింలు, చెట్లపల్లి చంద్రశేఖర్ తదితరులు తూప్రాన్ ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలకు వేరువేరుగా ఫిర్యాదులు చేశారు. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరారు.