బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ పడుతున్నారని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Visveshwar Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత (mlc kavita) జైలుకు వెళ్తారని అందరూ అనుకున్నారని, కవిత అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య.. ఒప్పందం ఉందని ప్రజలు భావిస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయని, బీజేపీ(BJP)లో జూపల్లి, పొంగులేటి చేరికలు ఆగిపోయాయని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీకి చాన్స్ లేదని, ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ పెడితే కేసీఆర్ (KCR) పురిటిలోనే చంపేస్తారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా.. తెలంగాణ(Telangana)కు ప్రథమ శత్రవు ప్రధాని కాదని కేసీఆరేనని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ప్రధాని ఎక్కడా చెప్పలేదని, ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే చెప్పారని గుర్తుచేశారు. పిట్టల దొర తుపాకీ రాముడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.